
దేవుడు వరమిచ్చినా మధ్యవర్తి అడ్డుకున్నట్లు.. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తేసినా ఆ లాభాన్ని పూర్తిస్థాయిలో కస్టమర్లకు అందకుండా కంపెనీలు పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 18 శాతం ఉన్న జీఎస్టీని ఎత్తేసి హెల్త్ ఇన్సూరెన్స్ పై జీరో ట్యాక్స్ తీసుకొచ్చిన వేళ.. కంపెనీలు ప్రీమియంను పెంచే వ్యూహంలో ఉన్నాయని మార్కెట్ ఎనలిస్టులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ఇన్సురెన్స్ కస్టమర్లకు ఉపశమనం కలిగించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఇన్సురెన్స్ పై ఉన్న ట్యాక్స్ మొత్తా్ని ఎత్తేసింది. అయితే ఆ లాభం కస్టమర్లకు పాస్ ఆన్ అయ్యే లోపే కంపెనీలు వేరే ప్లాన్ లో ఉన్నట్లు లేటెస్ట్ Kotak Institutional Equities రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 3 నుంచి 5 శాతం వరకు పెరగవచ్చని రిపోర్ట్ పేర్కొంది.
ఇటీవల ఏర్పాటు చేసిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం,2025, సెప్టెంబర్ 22 నుంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18% జీఎస్టీ పూర్తిగా రద్దు కానుంది. దీంతో కస్టమర్లు తక్కువ ప్రీమియం చెల్లించవచ్చునని భావించినా.. రియాలిటీలో పరిస్థితులు వేరేగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
►ALSO READ | కొత్తకారు కొనేటోళ్లకు మహీంద్రా, రెనాల్ట్ మెగా డిస్కౌంట్స్.. SUVలపై రూ.లక్ష 56వేలు తగ్గింపు..
ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటి వరకు చెల్లించిన ట్యాక్సులపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందుతూ వచ్చాయి. అయితే, జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో కంపెనీలకు ట్యాక్స్ క్రెడిట్ అందదు. దీంతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు సంస్థలు ప్రీమియం పెంచే అవకాశాలు ఉన్నాయని కోటక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.
నిపుణులు ఏమంటున్నారు ?
కోటక్ ఈక్విటీస్ ప్రకారం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నష్టాన్ని భర్తీ చేసుకోడానికి కంపెనీలు. 3–5% వరకు ప్రీమియం పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే 18 శాతం జీఎస్టీ ఎత్తేయడంతో.. మొత్తంగా కస్టమర్లకు 12–15% వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ప్రీమియం పెరుగుదల 1–4% లోపే ఉండవచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు.
అయితే ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉన్న నిపుణుల ప్రకారం.. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం కంటే 5 శాతం వరకు తగ్గించడం వలన ITC లాభం కంపెనీలకు అందుతుంది. దీని వలన కస్టమర్లకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇరువైపులా లాభం చేకూరుతుందని అంటున్నారు. ఇది వినియోగదారులకు, బీమా సంస్థలకు రెండింటికీ సర్దుబాటు అయ్యే పరిష్కారమని వారు సూచిస్తున్నారు.