
దేశీయ ఆటో పరిశ్రమకు ఈసారి దీపావళి, దసరా ముందుగానే వచ్చేశాయి. ఈవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో తగ్గిన జీఎస్టీ రేట్లను యూజర్లకు అందించేందుకు కార్ల కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతీ సుజుకీలు తమ కార్ మోడళ్లపై తగ్గింపులను ప్రకటించగా.. ఇదే దారిలో మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్ కంపెనీలు కూడా ముందుకు సాగుతున్నాయి.
పండక్కి కొత్త కారు కొనాలని వేచి చూస్తున్న భారతీయులకు మహీంద్రా, రెనాల్ట్ కలలో కూడా ఊహించని భారీ తగ్గింపులను ప్రకటించాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ తగ్గించబడిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పిన కంపెనీలు దానికోసం ప్రీ బుక్కింగ్స్ ఓపెన్ చేస్తూ తగ్గించబడిన రేట్లను మోడళ్లవారీగా ప్రకటించాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గించిన కారు రేట్ల వివరాలు..
- XUV3XO డీజిల్ మోడల్‌పై రూ.లక్ష 56 వేలు తగ్గింపు
- స్కార్పియో N ధర రూ.లక్ష 45 వేల వరకూ తగ్గింపు
- XUV700పై రూ.లక్ష 43 వేలు తగ్గనుంది
- XUV3XO పెట్రోల్ మోడల్ రేటు రూ.లక్ష40వేల వరకు తగ్గింపు
- థార్ 2WD డీజిల్ వేరియంట్ రూ.లక్ష 35 వరకు తగ్గింపు
- థార్ 4WD డీజిల్ కార్లపై రూ.లక్ష ఒక వెయ్యి వరకు తగ్గింపు
- బొలెరో/బొలెరో నీయోపై రూ.లక్ష27 వేలు తగ్గింపు
- స్కార్పియో క్లాసిక్ రూ.లక్ష ఒక వెయ్యి తగ్గింపు
- థార్ రొక్స్హ్ పై రూ.లక్ష 33వేల వరకు తగ్గింపు
ఇక ఇదే సమయంలో రెనాల్ట్ సంస్థ కూడా తన కార్ మోడళ్లపై తగ్గింపులను జీఎస్టీ సడలింపులకు అనుగుణంగా ప్రకటించింది.
మోడళ్ల వారీగా తగ్గిన రెనాల్ట్ రేట్లను పరిశీలిస్తే..
- క్విడ్ మోడల్‌లో రూ.54వేల 995 తగ్గింది
- ట్రైబర్ మోడల్ రూ.80వేల195 వరకు చౌకగా మారుతుంది
- కిగర్ మోడల్ రూ.96వేల 395 వరకు ధర తగ్గింపుతో అందుబాటులోకి పండక్కి వస్తోంది.