ఇవి మామూలు చెంప దెబ్బలు కావు.. క్లాస్మేట్ను 90 సెకన్ల పాటు వాయించేసిన లా స్టూడెంట్.. వీడియో వైరల్

ఇవి మామూలు చెంప దెబ్బలు కావు..  క్లాస్మేట్ను 90 సెకన్ల పాటు వాయించేసిన లా స్టూడెంట్.. వీడియో వైరల్

ఒక నలుగురైదురుగురు స్టూడెంట్స్.. క్లాస్మేట్ ను కారులో ఎక్కించుకుని.. మధ్యలో కూర్చోబెట్టుకుని.. ఎడా పెడా వాయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక 90 సెకన్ల పాటు పటా పటా చెంపలకేసి వాయించింది ఓ యువతి. చెయ్యి అడ్డం పెడితే మరింత సేపు వాయిస్తా.. చెయ్ తియ్.. అంటూ కొట్టిన వీడియోను నెటిజన్స్ ఫుల్లుగా సర్క్యులేట్ చేస్తున్నారు. 

లక్నోలో గత నెలలో చోటుచేసుకున్న  ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమిటీ యూనివర్సిటీకి చెందిన శిఖర్ ముఖేష్ కేసర్వాని అనే  స్టూడెంట్ ను 90 సెకన్ల పాటు 25 నుంచి 30 చెంపదెబ్బలు కొట్టారు అతని క్లాస్ మేట్స్. ఈ వీడియోలో శిఖర్ పై ఇద్దరు స్టూడెంట్స్ నాన్ స్టాప్ గా చెంపదెబ్బలు కొడుతూ.. బెదిరిస్తుండటం చూడవచ్చు.చెంపదెబ్బలు కొడుతుంటే అడ్డుకోవాలని చూశాడు శిఖర్. చెయ్యి అడ్డుపెడితే మరిన్ని దెబ్బలు తింటావ్.. చెయ్ తియ్.. అంటూ దాడికి దిగారు. 

ALSO READ : వైభవంగా సాగుతున్న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర..

ఈ ఘటనకు గల కారణాలు తెలియలేదు.     అమిటీ యూనివర్సిటీ నుంచి కూడా ఎలాంటి స్టేట్ మెంట్ రాలేదు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ దినేష్ చంద్ర మిష్రా తెలిపారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు 5 మంది విద్యార్థులపై FIR నమోదు చేసినట్లు తెలిపారు. 

ఈ ఘటన తర్వాత తమ కొడుకు తీవ్ర భయాందోళనకు గరయ్యాడని.. మానసిక వేదనతో కాలేజీకి వెళ్లడం లేదని విద్యార్థి తండ్రి తెలిపాడు. ఆగస్టు 26న తమ కొడుకు ఫ్రెండ్ అయిన అమ్మాయి కారులో పికప్ చేసుకుందని.. యూనివర్సిటీ పార్కింగ్ ఏరియా చేరే లోపు మరొక వ్యక్తి కారులోకి ఎక్కి.. ఒక 45 నిమిషాలు కారులో తమ కొడుకుకు హర్రర్ చూపించినట్లు తెలిపాడు. నాన్ స్టాప్ గా చెంప దెబ్బలు కొడుతూ.. బూతులు తిడుతూ భయాందోళనకు గురి చేసినట్లు చెప్పాడు. అంతే కాకుండా ఫోన్ డ్యామేజ్ చేసి.. క్యాంపస్ కు వస్తే ఈ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని బెదిరించినట్లు తెలిపాడు.