
తాడేపల్లి : వ్యవసాయ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అధికారులకు చూపించి సమీక్ష చేశారు జగన్. వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిపుణులతో కూడిన మిషన్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.
రూ.2 వేల కోట్లతో విపత్తుల నిధి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలో బోర్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఆ తర్వాత జలవనరుల శాఖపై సమీక్ష జరిపారు సీఎం.
