
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పు తేవాలన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం. అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరోసారి సమావేశం కావాలని..అప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలంటూ అధికారులను ఆదేశించారు జగన్.