
ఎవరైతే ధరణిని తీసేయాలని అంటారో వాళ్లనే తీసి బంగాళాఖాతంలో వేయాలన్నారు సీఎం కేసీఆర్. ధరణి తీసేస్తే మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలన్నారు. ధరణి వల్ల ఇవాళ భూములు 15 నిముషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని చెప్పారు. ధరణి వల్లే రైతుబంధు, రైతుభీమా స్తుందన్నారు. రైతు బీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదని కేవలం తెలంగాణలోనే ఉందన్నారు. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం రైతురుణమాఫీ చేశామన్నార కేసీఆర్.. ఇప్పటి వరకు రూ. 35 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.
మెదక్ జిల్లాకు కేసీఆర్ వరాలు
- రెవెన్యూ డివిజన్ గా రామాయంపేట
- రామాయంపేటకు డిగ్రీ కాలేజ్
- మెదక్ కు రింగ్ రోడ్డు
- జిల్లాలోని 469 గ్రామాలకు రూ.15 లక్షల చొప్పును మంజూరు
- మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు
- తుప్రాన్, నర్సాపూర్,రామాయంపేట మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు
- మెదక్ ఏడుపాయల టెంపల్ దగ్గర టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లు