ఒక బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు?

ఒక బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు?

టీఆర్ఎస్ పార్టీని కాకుండా వేరేవాళ్ళని గెలిపిస్తే సిటీ ఆగం అవుతుందని అన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ..  “అన్ని మతాలు..అన్ని కులాలు కలిసి వుండాలి. పక్క రాష్ట్రం వాళ్ళు మస్తు వస్తరు, చెప్పి పోతరు.. ఈడ వుండేది ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలి. జిమ్మేదార్ ఎవరు తీసుకుంటారు.. మా ఎమ్మెల్యే లు, ఎంపీ లు, ఎమ్మెల్సీ లు తీసుకుంటారు.. మహారాస్త్రొడు, యూపీ వొడు తీసుకుంటాడా అని అన్నారు. బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించండని అన్నారు.

“నేను ఢిల్లీ కి వస్త అని అక్కడ అందరు గజ గజ వణుకుతున్నారు.. ఇక్కడనే ఆపాలని అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు వస్తున్నారని, ఒక బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు? అంటూ ప్రశ్నించారు. యూపీ నుండి కర్ణాటక నుండి వస్తున్నారు… ఇది జాతీయ ఎన్నికలా? మున్సిపల్ ఎన్నికలే కదా అని అన్నారు.

“ఉత్తరప్రదేశ్‌ సీఎంకి అసలు టికానే లేదు… ఆయన నాకు నీళ్లు ఇస్తాడట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. తలసరి ఆదాయంలో యూపీ 28 వ‌ ర్యాంకుల్లో ఉంది. 28 వ ర్యాంకోడు వచ్చి 5 వ‌ ర్యాంక్‌ వచ్చిన మనకు చెప్తాడట అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. టెంటే లేదు.. ఫ్రంట్ పెడతారట అంటున్నారు.. ఫ్రంట్ పెడుతున్న అని ఎవడు చెప్పిండు? “అని ప్రశ్నించారు .

” హైదరాబాద్‌కు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దు. భూముల విలువలు, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త. నన్ను పోరా..రారా అంటున్నారు.. నేను ఏమి అనటం లేదు.. నేను తల్చుకున్ననంటే రోజూ నశం వేసి కొడతా. నేను టెంప్ట్ కావటం లేదు..అంతే కాని నా చేత కాక కాదు” అని అన్నారు కేసీఆర్.