వారంలోనే జీవో ఇస్తం..

వారంలోనే జీవో ఇస్తం..


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎస్టీ రిజర్వేషన్ ను10 శాతాని కి పెంచుతూ వారం రోజుల్లోనే జీవో ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ జీవోను ప్రధాని మోడీ గౌరవిస్తారో.. లేదంటే దానినే ఉరితాడు చేసుకుంటారో ఆయన ఇష్టమన్నారు. వెసులుబాటు చూసుకుని గిరిజనుల్లోని పేదలకూ దళితబంధు తరహాలో రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చే గిరిజన బంధును ప్రారంభిస్తామన్నారు. పోడు భూములపై హక్కులు కల్పించి, రైతుబంధు సాయం అందిస్తామన్నారు.  శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌‌‌‌ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం మాట్లాడారు.

 అంతకుముందు బంజారాహిల్స్‌‌‌‌ రోడ్‌‌‌‌ నం.10లో నిర్మించిన సంత్‌‌‌‌సేవాలాల్‌‌‌‌ గిరిజన భవన్‌‌‌‌, కుమ్రంభీం ఆదివాసీ భవన్‌‌‌‌లను ఆయన ప్రారంభించారు. ఆత్మీయ సమ్మేళనం వేదికపై సేవాలాల్‌‌‌‌, కుమ్రంభీంల విగ్రహాలకు నివాళులర్పించిన తర్వాత కేసీఆర్‌‌‌‌ స్పీచ్ ప్రారంభించారు. ‘‘ప్రధానికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్న గిరిజన రిజర్వేషన్‌‌‌‌ల జీవో ఎందుకు ఇస్తలేరు? రాష్ట్రపతిగా ఆదివాసీ బిడ్డనే ఉన్న ది.. పెంచిన రిజర్వేషన్‌‌‌‌లకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రపతి సంతకం పెట్టి ముద్ర కొట్టించి పంపుతరు.. రిజర్వేషన్‌‌‌‌లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నది? తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్‌‌‌‌లు ఇస్తుంటే కేంద్రం వాటిని ఏడో షెడ్యూల్​లో చేర్చి అమలు చేస్తున్నది’’ అని కేసీఆర్ అన్నారు.  

కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ నేతలు 


జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌‌‌‌లు పెంచాలం టూ చేస్తూ గిరిజన, ఆదివాసీ నాయకులు కేసీఆర్‌‌‌‌ కా న్వాయ్‌‌‌‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించా రు. ఎన్టీఆర్​ స్టేడియం వెళ్తుండగా ఇది జరిగింది.