
కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం హోదాలో ఓ నోట్ విడుదల చేస్తూ.. “సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, ప్రజలకి సేవలందించాలని ఆ భగవంతుణ్ని కోరుతున్నట్టు” కేసీఆర్ ఆ నోట్ లో తెలిపారు.
ఇందుకు సంజయ్.. “ విశాలమైన హృదయంతో తనకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ పెద్ద మనస్సుకి వందనములు.” అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. “తనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎంకు హృదయ పూర్వక ధన్యవాదాలు” అని ట్విటర్ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నమస్కారములు.నా జన్మదినం సందర్భంగా విశాలమైన హృదయంతో ఆశీస్సులు అందించిన మీ పెద్దమనుసుకు వినయపూర్వక వందనములు.హృదయపూర్వక ధన్యవాదములు.@TelanganaCMO pic.twitter.com/HPX2x7eFqh
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 11, 2019