ఆదిలాబాద్ జిల్లాలో.. సైబీరియన్ పక్షుల సందడి

ఆదిలాబాద్  జిల్లాలో.. సైబీరియన్ పక్షుల సందడి

ఆదిలాబాద్​ జిల్లాలో వలస పక్షులు ఆకట్టుకుంటున్నాయి. బోథ్​ మండలం మర్లప్లలి చెరువులో విదేశాలకుచెందిన రకరకాల పక్షులు  సందడి చేశాయి.  వింటర్​ సీజన్​ లో వివిధ దేశాలనుంచి వేలకిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన భారీ హెడెడ్​పక్షులకు ఆదిలాబాద్​ చిత్తడి నేలలు ఆతిథ్యమిచ్చాయి. జిల్లాకు వలస పక్షుల రాక మొదలైందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.  రకరకాల విదేశీ వలస పక్షులను చూసి పక్షి ప్రేమికులు మురిసిపోతున్నారు. 

శీతాకాలంలో సైబీరియా, మధ్య ఆసియా వంటి ప్రాంతాలనుంచి రెడ్​ క్రెస్టెడ్​ పోచర్డ్​, కామన్​ పోచర్డ్​, యూరేషియన్​ టీల్​, నార్తర్న్​ పోవెలర్​, నార్తర్న్​ పిన్​ టైల్​ వంటి అనేక రకాల వలస పక్షులకు ఆదిలాబాద్​ జిల్లాలో చెరువులు, చిత్తడి నేలలకు వలస వస్తాయి. నాలుగు నెలల పాటు ఇక్కడ బస చేయనున్నాయి. పక్షి ప్రేమికులకు, పరిశోధకులకు ఈ పక్షుల రాక ఒక అద్భుతమైన అనుభూతిని, అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది జిల్లా జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది. 

ప్రతియేటా వచ్చే ఈ పక్షుల సంరక్షణకు అటవీశాఖ అన్ని చర్యలు చేపడుతోంది. జిల్లాలో నాలుగుప్రాంతాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వలస పక్షులకు ఆతిథ్యమిచ్చే చెరువులు, చిత్తడి నేలల రక్షణకు కృషి చేస్తోంది.