కరీంనగర్జిల్లాలో ఎడ్లబండి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. కోట్ల వీరభద్రస్వామి వారి వార్షికోత్సవంలో నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో ఎడ్లబండి ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
ఆదివారం (జనవరి 18) గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లిలో కోట్ల వీరభద్రస్వామి వారి వార్షికోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల పోటీల్లో నిర్వహించారు. ఈ క్రమంలో పోటీలను వీడియో తీస్తున్న ఓ వ్యక్తిపైకి ఎడ్లబండి వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టింది. ఎద్దు ఒక్కసారిగా పైకి లేచి బలంగా ఢీకొట్టడంతో వీడియో గ్రాఫర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం కరీంనగర్ఆస్పత్రికి తరలించారు.
