మేడారం అభివృద్ది చరిత్రలో నిలిచి పోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 800ఏళ్ల చరిత్ర గలిగిన వనదేవతల మేడారం అభివృద్ది పనులు చేసిన ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. పనులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ణతలు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రామప్పనుంచి లక్కవరం వరకు పైపులైన్ ద్వారా జంపన్న వాగుకు నీళ్లిస్తామన్నారు.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు కేబినెట్ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవలే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు, జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ముందుగా నిర్ణయించి.. అనంతరం లాటరీ పద్ధతిలో మహిళలకు.. బీసీలకు స్థానాలను కేటాయించారు.
