పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలె

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్  తగ్గించాలె

రాష్ట్రంలో ఏం చేశారని దేశంలో సంచలనం సృష్టిస్తామంటున్నారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీశారంటూ ఆరోపించారు. తెలంగాణ రైతు కుటుంబాలను పరామర్శించలేదు గానీ, ఎక్కడో  ఉన్న రైతు కుటుంబాలకు చెక్కులు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీనంగర్ లో పర్యటించిన బండి సంజయ్.. ఈ నెల 25న జరిగే హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. 

రాష్ట్రాన్ని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన వారికి సహాయం చేయడం ఏంటని ప్రశ్నించారు. అడ్డదారిలో పైసలు సంపాదించిన వారందరినీ సీఎంవో (CMO)ఆఫీసులో పెట్టుకున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ శిక్షణా శిబిరంలో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. 


మరిన్ని వార్తల కోసం..

తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోడీ ట్వీట్

మూడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు