సీఎం కేసీఆర్ ను శరత్ తప్పుదోవ పట్టించాడంటున్న పాలోళ్లు

సీఎం కేసీఆర్ ను శరత్ తప్పుదోవ పట్టించాడంటున్న పాలోళ్లు

మంచిర్యాల రైతు ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగింది. భూ సమస్యపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన శరత్ తో సీఎం ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే తమకు అన్యాయం జరిగిందంటూ ఆరైతు బంధువులు గొంతెత్తారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్నభూమిపై శంకరయ్య కుమారుడు శరత్ వివాదం చేశాడని, దానికి సీఎం స్పందించి వారికే భూమిని పట్టా చేయడం సరికాదంటూ కొండపల్లి మల్లయ్య, ఆయన కూతురు జ్యోతి అంటున్నారు.

‘‘అది ఉమ్మడి ఆస్తి. ఇప్పటికి పంపకాలు కాలేదు. మాకు కేవలం2.25 ఎకరాల భూమిని ఇచ్చి శంకరయ్య 7.01ఎకరాల భూమిని పట్టా చేయించుకున్నాడు. మాకు ఇచ్చిన 2.25 ఎకరాల భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సీఎం శంకరయ్యకు న్యాయం జరిగేలా ఆదేశాలిచ్చారు. ఇద్దరికీ భూమినిపంచి పట్టాలిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. సీఎం చర్యతో మాకు అన్యాయం జరుగుతుంది. సీఎంను శంకరయ్య కొడుకు శరత్ తప్పుదోవ పట్టించాడు. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలె. మేం హైదరాబాద్‌లో కాదు.. శ్రీరాంపూర్‌లో ఉంటాం ’’అని వారు పేర్కొన్నారు . తమకు అన్యాయం జరిగిందంటూ గురువారం మంచిర్యాల కలెక్టర్​ భారతి హోళికెరి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. శరత్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారడంతో బుధవారం సీఎం ఆయనకు స్వయంగా ఫోన్‌ చేసిమాట్లాడడం, జిల్లా కలెక్టర్ వెళ్లి శంకరయ్య కుటుంబానికి పట్టా ఇవ్వడం, ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్చేయడం తెలిసిందే.

రికార్డులను మాత్రమే సవరించాం: కలెక్టర్‌
శంకరయ్య పేరిట ఉన్న భూమి రికార్డులను సవరించామని, ఎలాంటి పట్టా మార్పిడి జరగలేదని కలెక్టర్​ భారతి హోళికెరి చెప్పారు. ‘‘కేవలం రెవెన్యూ రికార్డులను పరిశీలించి సాంకేతిక తప్పులను సవరించాం. ఈ సవరణ అప్పటికప్పుడు జరిగింది కాదు. కొంతకాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో కొండపల్లి శంకరయ్య పేరు వస్తోంది. వీఆర్వోపొరపాటున పేరు తప్పుగా నమోదు చేశారు. దాన్నేసవరించాం . పట్టాదారు నుంచి వారసత్వ భాగస్వామ్య హక్కు కలిగిన అందరి అంగీకారంతో, కోర్టుఉత్తర్వుల మేరకు పట్టా మార్చుతాం’’ అని చెప్పారు.

పాస్ బుక్‌ ఇవ్వొద్దు: సీఈవో
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలోరైతులకు పాస్‌బుక్‌ ఇవ్వకూడదని సీఈవోరజత్ కుమార్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీ ఆర్‌రైతుతో మాట్లాడి మంచి ర్యాల కలెక్టర్‌కుఆదేశాలిచ్చిన అంశాన్ని పరిశీలిస్తున్నట్లుచెప్పారు . ‘‘దీనిపై పూర్తి నివేదిక రావాల్సిఉంది. ఇదంతా రాజకీయ కోణంతో జరుగుతున్నట్టు గా అనుమానం ఉంది. వాస్తవాలను పరిశీలించి ఈసీకి నివేదిస్తాం. ఎన్నికలకోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రైతుకుపాస్‌బుక్‌ ఇవ్వకూడదు. మంచి ర్యాల కలెక్టర్‌నాకు ముందుగానే సమాచారం ఇచ్చారు .బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కూడాలేట్‌గా జాయిన్‌ అయ్యారు ’’ అని అన్నారు.