భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి జరిగితే సహించను

భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి జరిగితే సహించను

ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇందుకోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించారు. మూడునాలుగు రోజులు బిల్డర్లు, రియల్టర్లతో సమావేశమై… వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. ఆతర్వాత అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై క్యాంప్ ఆఫీస్ లో మంత్రులు, అధికారులతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి… సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షలో పాల్గొన్నారు.