
ప్రజల కోసం రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా దేశంలో ఎక్కడైనా ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న నీటి వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు రావాలని కోరుకున్నా అన్నారు. సీమకు నీళ్లు రాకూడదని ఎవరు వద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పిలిపించి ఇదే విషయం చెప్పానన్నారు. కృష్ణాలో నీళ్లు లేవు గోదావరిలో నీళ్లు తెచ్చుకోండి అని ఏపీ ప్రభుత్వానికి చెప్పామన్నారు. మేం తెచ్చుకుంటున్నాము మీరు కూడా తెచ్చుకోవాలని చెప్పాం. మేం బేసిన్‌లు భేషజాలాలు వద్దన్నారు.
కృష్ణా గోదావరి కావేరి నీళ్ల అను సంధానం గురించి కేంద్రం ఎన్నికలు వస్తేనే మాట్లాడుతుందన్నారు. తమిళనాడు ఎన్నికలు అవ్వగానే ఇక అవేం మాట్లాడారని కేంద్రంపై విమర్శలు చేశారు కేసీఆర్. రెండు రాష్ట్రాల అవసరాలు సంపూర్ణంగా తీరిన తర్వాత మిగిలిన జలాల్ని బయటకు తీసుకు వెళ్లవచ్చన్నారు. అంతే కాని పక్క రాష్ట్రాలకు వెళ్లి చేపలు పులుసు తిన్నారు? అని మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో చేపలు పులుసు తినడం తప్పా అంటూ ప్రశ్నించారు. మాట్లాడే శక్తి లేనోళ్లు, అడిగిన ప్రశ్నకు సమాధనం చెప్పలేనోళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటారా లేదా? అని నిలదీశారు సీఎం.