నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టెన్షన్

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టెన్షన్

నిజామాబాద్ లో కవిత ఓటమి ఇప్పుడు ఆ పార్టి ఎమ్ఎల్ఏ లకు శాపంగా మారింది. హోరాహోరిగా సాగిన పోరులో టిఆర్ఎస్ ఓటమి పాలవటంతో… ఆ పార్టీ ఓటమిపై సాకులు వెతికే పనిలో పడింది. ప్రజా వ్యతిరేఖత ముందు నిలవలేక ఓటమికి పలు కారణాలు చెబుతుంది. ఓటమిపై కవిత ఇప్పటికే సియం కేసీఆర్ కి ఓ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం

అసెంబ్లీ ఎన్నికలు ముగియాగానే జిల్లాలొ రైతుల ఆందోళనలు మొదలయ్యాయి. ఎర్రజొన్న, పసుపుకు మద్దతు ధర కొరుతూ రైతులు నిత్యం ఆందోళనలు చేసారు. రాస్తారోకొలు, జాతీయ రహదారుల దిగ్భందం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రజొన్నలు, పసుపు పంటల మద్దతు ధరల కోసం  రైతులు చేసిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తమ సమస్య పరిష్కరించకుంటే పార్లమెంటు ఎన్నికల్లో అత్యదిక సంఖ్యలో పోటీ చేస్తామని రైతులు పదే పదే హెచ్చరించారు. అయినా అధికార టిఆర్ఎస్ పార్టి ఈ ఆందోళనలను విస్మరించింది. ఆ పార్టి నేతలు, శాసన సభ్యులు అందరూ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. అదిష్టానికి కూడా సరైన నివేదిక ఇవ్వలేదు. ఇదే సమయంలో బిజేపి రైతుల ఆందొళనకు మద్దతిచ్చింది. ఆ పార్టి నేత అరవింద్ పలు చోట్ల రైతులతో ఆందోళనలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు వచ్చాయి. ప్రధాన పార్టీలతో పాటు రైతులు కూడా నామినేషన్లు వేయటానికి వచ్చారు. అయితే ఈ సమయంలో అధికారులు పలు కారణాలతో నామినేషన్ల సమయంలో ఇబ్బందులు సృష్టించారు. ఇది కూడా వివాదాస్పదమైంది. మొత్తం మీద 179 మంది రైతులు నామినేషన్లు వేసారు. ఇక్కడే టిఆర్ఎస్ పార్టి విఫలమైంది.

 

ఇంత మంది రైతులు నామినేషన్లు వేసినా వారిని ఒప్పించి నామినేషన్లు విత్ డ్రా చేయించలేకపోయారు టిఆర్ఎస్ ఎమ్ఎల్ఏ లు. వీరితో ఏమౌతుందిలే అని నిర్లక్ష్యం చేసారు. ఇక్కడే టిఆర్ఎస్ నైతికంగా ఓడీపోయింది. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడే వారిని ఓటమి రుచి చూపించింది. ఇక ప్రచారం సమయంలో కూడా శాసన సభ్యులు ఎలాగు గెలుస్తాం లే అని తేలిగ్గా తీస్కున్నారు. అదే సమయంలో బిజేపి పక్కా ప్రణాలికతో ప్రచారం చేపట్టీంది. మరోపక్క కవిత రెండొ సారి కూడా ఎంపిగా గెలిస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుందని భావించిన ఎమ్ఎల్ఏ ప్రచారం కూడా మొక్కుబడిగా చేసారు. మరోపక్క ఎన్నికలకు ముందు  జరిగిన మంత్రి వర్గ కూర్పు కూడా ఎమ్ఎల్ఏ లమద్య చిచ్చుపెట్టీంది. రకరకాల సమీకరణాల్లో తమకే మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన ఎమ్ఎల్ఏ లు ప్రశాంత్ రెడ్డీకి మంత్రి పదవి ఇవ్వటాంతో అలక వహించారని ఆ పార్టి నేతలే బహిరంగంగా చెబుతున్నారు. నియోజక వర్గాల వారీగా పోలింగ్ బాద్యత ఎమ్ఎల్ఏ లకే అప్పగించటాంతో “తడిసిమోపెడవుతుందని” లైట్ గా తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రేస్ శ్రేణూలు కూడా బిజేపికి అంతర్గతంగా పనిచేయటం, డిఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరవెనుక చక్రం తిప్పటంతో అరవింద్ బారీ మెజారిటితో కవితపై విజయం సాదించారు. అరవింద్ గట్టీ పోటీ ఇచ్చినా గెలుపు వరిస్తుందా ? అని చాలా ప్రశ్నలు తలెత్తాయి… కానీ రిజల్ట్స్ లొ దూసుకుపోవటాంతో టిఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతుంది. పోటి ఉందని తెలిసినా, చాలా అంశాలని విస్మరించటాం, నిర్లక్ష్యం, రైతుల పట్ల వ్యతిరేఖ భావం టిఆర్ఎస్ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు..

సియం కూతురే ఓడిపోవటంతో టిఆర్ఎస్ డీలా పడింది. సియం కేసిఆర్ సైతం కూతురు ఓటమి పట్ల చాలా సీరియస్ గా ఉన్నారట. త్వరలోనే ఎమ్ఎల్ఏ లతో మాట్లాడానున్నట్లు సమాచారం. కవిత ఓటమికి ఎమ్ఎల్ఏ లను బాధ్యులను చేస్తారట…ఇదే జరిగితే మెజారిటి ఇవ్వని ఎమ్ఎల్ఏ లకు ఇబ్బందులు తప్పవు. గట్టీగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే ఎమ్ఎల్ఏ లు ఎలా స్పందిస్తారో? చూడాలి… ఎన్నికల ఇంచార్జిగా ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డీ పదవి ఉంటుందా? లేదా? అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఎం జరగనుందో చూడాలి.. మొత్తం మీద కవిత ఓటమి టిఆర్ఎస్ పార్టీలో కాక రేపిందని చెప్పాలి