
భారత పారిశ్రామిక దిగ్గజం, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవేశ్వర్.. శనివారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని అలంకరించారు. ఫిబ్రవరి 5, 2012న దేవేశ్వర్ చైర్మన్‌గా ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.