Gaddar: తెలంగాణ గొప్ప కవిని కోల్పోయింది: సీఎం కేసీఆర్

Gaddar: తెలంగాణ గొప్ప కవిని కోల్పోయింది: సీఎం కేసీఆర్

ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar) మృతికి సీఎం కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. గద్దర్(Gaddar) మృతి చాలా బాధకరమని.. ఆయన మరణం తీరని లోటు అని అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) మరణంతో తెలంగాణ (Telangana)  గొప్ప కవిని కోల్పోయిందన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) అని కొనియాడారు. తన పాటతో పల్లెపల్లెనా తెలంగాణ భావజాలం వ్యాప్తి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం రగిలించారని గుర్తు చేసుకున్నారు. 

కళలకు, ఉద్యమాలకు గద్దర్‌ (Gaddar) చేసిన సేవలు మరువలేనివి, తెలంగాణ పాటకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్‌ (Gaddar)మృతి బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. గద్దర్ (Gaddar) మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గద్దర్‌ సాధారణ బుర్రకథ కళాకారుడిగా జీవితం ప్రారంభించి..విప్లవ పంథాలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా గద్దర్‌(Gaddar)తో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ (KCR) గుర్తు చేసుకున్నారు. ప్రజల హృదయాల్లో గద్దర్(Gaddar) ప్రజా యుద్ధ నౌకగా నిలిచారని అన్నారు. గద్దర్(Gaddar) కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.