ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర: థామస్ రెడ్డి

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర: థామస్ రెడ్డి

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను ఇంతవరకు ఇవ్వలేదున్నారు. కార్మికుల ఫీఎఫ్ డబ్బులను ప్రభుత్వం వాడుకుందని… పండగపూట వారికి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. కార్మిక చట్టాల ప్రకారమే సమ్మె నోటీసులిచ్చామన్నన థామస్ రెడ్డి.. కార్మిక సంఘాలను చర్చలకు పిలవక పోవడం దారుణమన్నారు. కార్మికులను బయపట్టాలని ప్రభుత్వం చూస్తోందని..అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదన్నారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని.. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తేల్చి చెప్పారు థామస్ రెడ్డి.