తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు

తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలది ఉజ్వలమైన చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రం గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని.. కానీ 58 ఏళ్ల సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగే తరుణంలో ఇక్కడ ఏ విషయాన్ని కూడా అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. 

ఎయిర్ స్ట్రిప్స్ ఊసే లేదు

‘రాష్ట్రంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన ఎన్నో  పురాతన కోటలు, గడీలు, బురుజులు, ఆలయాలు ఉన్నాయి. రామప్ప, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయంతోపాటు మరెన్నో గుళ్లు మన దగ్గర ఉన్నాయి. ఈ విషయంపై ప్రధాన మంత్రితో చిన్న గొడవ పెట్టుకున్నా.. పద్మ శ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా వద్దా అని ప్రధానిని అడిగాను. పేర్లు పంపి విసిగిపోతున్నామని ఆయనకు చెప్పా. పద్మ శ్రీ అవార్డుకు అర్హులైన కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు మా దగ్గర లేరా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారిని ప్రశ్నించాను. అయితే చిన్నబుచ్చుకోవద్దని, పరిశీలన చేస్తామని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రిప్స్ కావాలని కేంద్రాన్ని అడిగి ఆరేళ్లు దాటింది. ఇప్పటివరకు వాటి ఊసే లేదు. తెలంగాణ మీద కేంద్రం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోంది’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు:

‘మా’ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా

ఒక్క కారణంతో ఇన్ని కేసులా: హైకోర్టు ఆగ్రహం

బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా