
తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్ శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) సీఎం కేసీఆర్ నియమించారు.
ALSO READ : మహిళలకు చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థికశాఖను ఆదేశించింది. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.