ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నించాలని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రగతి భవన్‌‌‌‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. మూడున్నర గంటలకుపైగా సాగిన సమావేశంలో కేంద్ర విధానాలను ఎలా ఎండగట్టాలనే దానిపైనే చర్చించారు. ప్రతిపక్షాల సభ్యులు చేసే ధర్నాలకు అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళన చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుద్దామని కేసీఆర్ చెప్పారని ఎంపీలు వెల్లడించారు.

అంబేద్కర్​ స్ఫూర్తితో పని చేస్తున్నాం: సీఎం

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత, బహుజన, పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తున్నదని చెప్పారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ మేరకు సోమవారం సీఎంవో ఒక ప్రకటన రిలీజ్​ చేసింది. సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.