మాది రైతు బంధు పార్టీ..వాళ్లది రాబందు పార్టీ

మాది రైతు బంధు పార్టీ..వాళ్లది రాబందు పార్టీ

టీఆర్ఎస్ అంటే రైతు బంధు పార్టీ అన్నారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా హలియా సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్  పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత ఆ  పార్టీకి లేదన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని…కాంగ్రెస్ రాబందు పార్టీ అన్నారు. ఒక్కరూపాయి ఎవరికీ లంచం ఇవ్వకుండా రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. టీఆర్ఎస్ పార్టీ క్లీన్ పార్టీ అని అన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడించండి..నిజమే అయితే ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.