రాష్ట్రం సరిపోక, దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నరు

రాష్ట్రం సరిపోక, దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నరు

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు... కానీ ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారని.. అందుకోసమే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రం సరిపోక, దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న కిషన్ రెడ్డి.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ జాతీయ పార్టీ తెరపైకి తెచ్చారని తెలిపారు. కుటుంబ పాలనకు అండగా ఉండాలో.. దేశం కోసం పని చేసే వారి కోసం అండగా ఉంటారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు