హాలియా: పిచ్చి కార్యక్రమాలు చేస్తే తొక్కిపడేస్తామన్నారు సీఎం కేసీఆర్. బుధవారం హాలియా సభలో కేసీఆర్ మాట్లాడుతుండగా.. కొందరు నిరసనలు తెలిపారు. అయితే వారిపై సీరియస్ అయిన కేసీఆర్.. మీ లాంటి కుక్కలను చాలామందిని చూశామన్నారు. అలాగే కొత్త బిచ్చగాళ్లలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. పిచ్చిగా మాట్లాడితే తొక్కి పడేస్తామన్నారు. మేం తలుచుకుంటే బీజేపీ దుమ్ము దుమ్ము అయితదన్నారు. ఇక్కడ ఎవ్వరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ.. వీపు చూపించే పార్టీ కాదన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ కు తెలంగాణ పేరెత్తే అర్హత లేదన్న సీఎం.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్సే అన్నారు. ఢిల్లీ వాళ్లు నామినేట్ చేస్తే వచ్చిన పార్టీ తమది కాదని.. పిచ్చి కార్యక్రమాలు చేస్తే తొక్కి పడేస్తామన్నారు. ముళ్లు ఎక్కువ ఉంటే పొల్లు పొల్లు చేస్తామంటూ సీరియస్ అయ్యారు సీఎం కేసీఆర్.
