
హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 16న ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆహ్వానించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో మంగళవారం సీఎంను కలిసి జాతర ఇన్విటేషన్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనెల 18న సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం..