ముందస్తు ఎన్నికలు లేవు.. ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేయాలి : కేసీఆర్

ముందస్తు ఎన్నికలు లేవు.. ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేయాలి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని.. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. మార్చి 10వ తేదీ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారాయన. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రతి ఎమ్మెల్యే పాదయాత్ర చేయాలని ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను జనానికి వివరించాలన్నారు కేసీఆర్. 

ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఆ రోజు ప్లీనరీ సమావేశం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.