
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం ఆయన తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు ఎవరెవరు వెళతారనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని రూ.5 కోట్ల బంగారు ఆభరణాలను సమర్పించారు.