
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి. 34లక్షల మెంబర్ షిప్‌తో తెలంగాణ కాంగ్రెస్ నంబర్ వన్‌గా నిలిచిందన్న గీతారెడ్డి.. అందరి శ్రమతో అది సాధ్యం అయిందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందన్నారు. అందుకే పీకేను తెలంగాణకు తెచ్చుకున్నారని గీతారెడ్డి అన్నారు. రాష్ట్రంలో నల్గొండ పార్లమెంట్ 4లక్షల మెంబర్ షిప్‌తో ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉన్నచోట అంత సభ్యత్వం సాధ్యం అయిందన్నారు. అంబర్ పేటలో 1600 సభ్యత్వాలే అయ్యాయని చెప్పారు. అక్కడ కష్ట పడాలి..గట్టి నాయకులున్నా కూడా సికింద్రాబాద్‌లో మెంబర్ షిప్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెప్పారు. బూత్ లెవల్లో బలపడితేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువబోతోందని.. మెంబర్ షిప్ విషయంలో ఏఐసీసీ సీరియస్‌గా ఉందని అందరూ సీరియస్‌గా పనిచేయాలని సూచించారు గీతారెడ్డి.
మరిన్ని వార్తల కోసం:
కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు
రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు