
ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవ్వడూ సీఎం కేసీఆర్ తో పొత్తు పెట్టుకోడని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిజెపి లో ఎవరూ చేరొద్దని ఆ పార్టీతో పొత్తు ఉంటుందని , బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని ఎమ్మెల్యే లకు కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడని అన్నారు. 2023 లో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని, అలాంటప్పుడు కేసీఆర్ తో మాకు పొత్తు ఎలా ఉంటుందని అన్నారు. దుర్మార్గుడైన కేసీఆర్ తో, TRS తో బీజేపీకి పొత్తు ఉండదని సంజయ్ అన్నారు.
ఆదివారం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం (టీచర్ల అసోసియేషన్) డైరీని సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడుకు ను సీఎం నీ చేయడం కోసమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే సీఎం కాళేశ్వరం వెళ్లారని, తాము చెప్పింది వాస్తవం కాబట్టే కేసీఆర్ ఖండించడం లేదన్నారు. కేసీఆర్ వాస్తవాలు చెప్పాలని బండి సంజయ్ సూచించారు
కేసీఆర్ ఒక జోకర్ అని, ఆయనంత అవినీతిపరుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని అన్నారు. తనకు అనుకూలంగా లేరని రెవెన్యూ ఉద్యోగుల వ్యవస్థ మొత్తాన్ని అవినీతిపరులుగా చిత్రీకరించాడని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకి ఇంతవరకూ పోస్టింగులు ఇవ్వలేదని, కరోనా టైం లో ప్రవేట్ ఉద్యోగులను, టీచర్స్ ను పట్టించుకోలేదని సంజయ్ అన్నారు.