
సిటీలోని హైదర్ గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాలను ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేశారు సీఎం కేసీఆర్. ఈ నెల 17న ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రారంభించనున్నామని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. అంతకుముందు ఉదయం ఆరు గంటల నుంచి ఆర్ అండ్ బీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు చేస్తారు.