ఎవడో ఎల్లయ్య కాదు..రైతు వేదికలే ధర నిర్ణయించాలి..

ఎవడో ఎల్లయ్య కాదు..రైతు వేదికలే ధర నిర్ణయించాలి..

రైతు వేదిక ఒక ఆటంబాంబు అని..అక్కడే పంట ధరలు నిర్ణయించాలన్నారు  సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలోని కొడకండల్లో రైతు వేదికను ప్రారంభించిన కేసీఆర్.. రైతులను గవర్నమెంట్ ఎందుకు నియత్రించాలని… ఎవడో ఎల్లయ్య కాదు రైతు వేదికలే ఏ పంట వేయాలి.. ధరెంత అనేది  వాళ్లే నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి  రైతులపై ప్రేమ లేదన్నారు. దేశంలో ఎక్కడైనా రైతులు నిరసన తెలుపుతారన్నారు. దేశంలో రైతులు ఒక దగ్గర కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదన్నారు.  ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవన్నారు. రైతు వేదికను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతుల కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. ఇందు కోసం రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు.   రైతులంతా కూర్చొని చర్చించాలన్నారు. కేంద్ర సర్కార్ కండ్లు తెరిపించాలన్నారు. రైతుల ఆత్మహత్యలు బాధలు స్వయంగా చూశానన్నారు. రైతు బీమా తాను పనిలేక పెట్టిలేదని?  తన బుర్రలోనే పుట్టిన ఆలోచన్నారు.

రైతు వేదికలే పంట ధరలు నిర్ణయించాలన్నారు. పంటలపై సూచనలకు ఐఏఎస్ ను పెడతామన్నారు. అధికారులు మాట్లాడితే రైతులు కూర్చొని మాట్లాడలన్నారు. రైతు వేదికలు గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చామన్నారు. ఎవరూ అడగకున్నా రైతు బీమా ఇచ్చానన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతు బంధు ఆగదన్నారు. అనుభవదారు మూడేళ్లుంటే భూమి హక్కులు వస్తాయన్నారు. రైతుల కోసమే వీఆర్వో వ్యవస్థ రద్దు చేశానన్నారు.

వడ్లు ఏవైనా ఒకటే ధరకు కొనాలని ఎఫ్ సీఐ ఆర్డర్ అని అన్నారు. వడ్లు ఎక్కువ ధకు కొందామన్నా కొనే పరిస్థితి లేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. గ్రామాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు.కరోనా వైరస్ బాధ ఇంకా పోలేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 2601 రైతు వేదికలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో 2462 పట్టణాల్లో139 రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 1580 రైతు వేదికల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మరో 1021 వేదికలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.