వనపర్తి, వెలుగు : యూరియా కేటాయింపు కోసం లంచం డిమాండ్ చేసిన వనపర్తి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆంజనేయులుగౌడ్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ మహబూబ్‌నగర్ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఆగ్రో రైతు సేవా కేంద్రానికి చెందిన ఓ ఫర్టిలైజర్ డీలర్ ఇటీవల జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్‌ను కలిసి రబీ సీజన్‌కు సంబంధించిన యూరియాను ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని కోరారు. దీంతో రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫసీర్ ముందుగా రూ. 3 వేలు తీసుకున్నారు. మిగతా డబ్బుల కోసం అడుగగా.. సదరు డీలర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో శుక్రవారం కలెక్టరేట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఆంజనేయులుగౌడ్‌ను కలిసి రూ. 10 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆంజనేయులుగౌడ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన అగ్రికల్చర్ ఆఫీసర్‌ను శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
