అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ నెల 25 రాత్రి …8 గంటలకు విందు ఏర్పాటు చేశారు. దీనికి అతి తక్కువగా 90 నుంచి 95 మందికి మాత్రమే రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపింది. ప్రధాని మోడీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు ట్రంప్ తో విందులో పాల్గొంటారు. ఇక కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర, హర్యానా, బిహార్, ఒడిశా, కర్నాటక సీఎంలకు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడంతో ట్రంప్ తో విందు కోసం 25 మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు కేసీఆర్.
