రిటైర్డ్ ఆఫీసర్లకు కేసీఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు

రిటైర్డ్ ఆఫీసర్లకు కేసీఆర్  వన్ ప్లస్ వన్ ఆఫర్లు

దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆఫర్లు మన రాష్ట్ర సర్కార్ ఇస్తోంది. నచ్చినోళ్లకు నచ్చినట్టుగా పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం కేసీఆర్. CS, DGPలతో పాటు కొంత మంది ఉన్నతాధికారుల రిటైర్ తర్వాత CMO, లేదంటే ఏదైన శాఖలోనో అడ్జస్ట్ చేస్తున్నారు సీఎం. వన్ ప్లస్ వన్ లో కేసీఆర్ నుంచి ఊహించని ఆఫర్లు అందుకుంటున్నారు రిటైర్డ్ బాసులు. అందరికీ ఇస్తారంటే ఇవ్వరు..నచ్చినవాళ్లకు మాత్రమే నజరానా ఇస్తారు ముఖ్యమంత్రి. 

లేటేస్ట్ గా మాజీ సీఎస్ సోమేష్ కుమార్..సీఎం కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో మూడేళ్లు పదవిలో ఉంటారని ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవానికి సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ IAS అధికారి. తెలంగాణ సీఎస్ గా పనిచేస్తున్నప్పుడే..హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఏపీలో చేరినట్టే చేరి  VRS తీసుకున్నారు సోమేష్ కుమార్. వీఆర్ఎస్ తీసుకున్నప్పుడే సోమేష్ కు తెలంగాణలో ఏదో ఒక పదవి ఖాయమని తేలిపోయింది. సేమ్ టైమ్ ఔరంగాబాద్ BRS సభలో సోమేష్ కుమార్ కనిపించడంతో..పార్టీలో చేరతారన్న వార్తలొచ్చాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ కే చీఫ్ అడ్వైజర్ అయ్యారు సోమేష్ కుమార్.

కేసీఆర్ ఆపర్లు అందరికీ దక్కవు. కండీషన్స్ అప్లై చేస్తారు ముఖ్యమంత్రి. పదవీ విరమణ తర్వాత అదనపు పోస్టు దక్కాలంటే..వాళ్లకు అదనపు క్వాలిటీస్ ఉండాలంట. సీఎం కేసీఆర్ చెప్పినట్టు వినడమో, నచ్చినట్టు చేయడమో, అన్నింటికీ యస్ చెప్పడమో..చేయాలంట. ఇట్లతైనే బంఫర్ ఆపర్ దక్కేది..లేదంటే అంతే. కేసీఆర్..ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే..రిటైర్ట్ అయ్యేలోపే..మరో పదవి రెడీగా ఉంటుందంట. 

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నది ఇదే. సమాజ్ దారీ అయితే..సలహాదారు  ఉద్యోగం పక్కా అని సీనియర్ ఐఏఎస్ లు చర్చించుకుంటున్నారట. సీఎస్ అయితే చాలు..రిటైర్డ్ అయ్యేలోపు మరో పోస్టు పక్కా అనుకుంటున్నారట. అవసరం లేకున్నా ప్రత్యేక పోస్టులో..లక్షల జీతంతో..కేబినెట్ హోదాలో దర్జాగా ఉండొచ్చని చర్చించుకుంటున్నారట.

ఇప్పటివరకు రాష్ట్రంలో సీఎస్ లుగా చేసిన ఐదుగురిలో...ముగ్గురు సలహాదారుల ఆఫర్ కొట్టేశారు. మొదటి సీఎస్ రాజీవ్ శర్మ..ఇప్పటికీ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. SK జోషి సీఎస్ గా రిటైర్డ్ అయ్యాక ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆఫర్ కొట్టేశారు. ఇప్పుడు ఆ లిస్టులో సోమేష్ కుమార్ కూడా చేరారు. ఇక తెలంగాణ ఫస్ట్ GGP అనురాగ్ శర్మ.. రిటైర్డ్ కాగానే ప్రభుత్వ సలహాదారుగా నియమించారు KCR. ఇతర డిపార్ట్ మెంట్లల్లో రిటైర్డ్ అధికారులకు కూడా పదవులు కట్టబెట్టారు CM. క్యాస్ట్ ఈక్వేషన్ల ఆధారంగానే సలహాదారులను నియమించుకుంటున్నారనే చర్చ ఈమధ్య జరుగుతోంది. ఎవరేమనుకున్నా కేసీఆర్ రూటే సపరేటు అంటున్నారు ఆపీసర్లు.