
మెదక్ జిల్లా పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ నుంచి బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మెదక్ చేరుకుంటారు కేసీఆర్. మెదక్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు మెదక్ లోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇదే సభలో దివ్యాంగుల పెన్షన్ పెంపుపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు ఏర్పాట్లును దగ్గరుండి పరిశీలించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థలు లిస్ట్ ను ప్రకటించిన అనంతరం జరుగుతున్న ఈ బహిరంగ సభలో సీఎం ఏం మాట్లాడనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పెడింగ్ లో ఉన్న నర్సాపూర్ టికెట్ పై ఈ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.