వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణ, లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ సీఎంఓ కార్యాలయం సమాచారం మేరకు..రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం 4.30 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యగశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులతో చర్చించనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.
