లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం కీలక సమావేశం పెట్టనున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ఉన్నా కూడా ప్రజలు మాత్రం ఇళ్లను వదిలి రోడ్ల మీదికి వస్తూనే ఉన్నారు. దాంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వైద్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి పలు అంశాల పట్ల మాట్లాడుతారు.

For More News..

మలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు

కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు