ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో పోరాడాలె

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో పోరాడాలె

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై పార్లమెంట్ వేదికగా పోరాడాలని ఎంపీలను ఆదేశించారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాణి వినిపించాలన్నారు. క్యాంప్ ఆఫీస్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. రేపట్నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు కేసీఆర్. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు కేసీఆర్. విద్యుత్ చట్టాల ఉపసంహరణపై పోరాటం చేయాలని సూచించారు.

రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో వెనక్కితగ్గేది లేదన్నారు. మోటార్లకు విద్యుత్తు మీటర్ల బిగింపు విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సూచించారు కేసీఆర్. తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్దమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని తెలిపారు. తెలంగాణ వరిధాన్య సేకరణలో  స్పష్టతకోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు సిఎం కేసీఆర్దిశానిర్దేశం చేశారు.