రాజ్ భవన్లో సీజేఐ రమణను కలిసిన సీఎం కేసీఆర్

రాజ్ భవన్లో సీజేఐ రమణను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను న్యాయమూర్తులు సన్మానించారు. ఈ విందులో ఏపీ హైకోర్టు సీజే ఏకే గోస్వామితో పాటు పలువురు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. కాగా రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. యాదాద్రి దర్శనానికి సీజేను ప్రత్యేకంగా ఆహ్వానించారు. పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, లాయర్ సంఘాల ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా జస్టిస్ రమణను కలిశారు. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 70 శాతం పెంచినందుకు సీజేకు కృతజ్ఞతలు తెలిపారు. దీని వల్ల ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుందని, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని అన్నారు. 

ఇయ్యాల యాదాద్రికి సుప్రీంకోర్టు సీజే

సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు జస్టిస్‌‌‌‌ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కూడా వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రి ఆలయాన్ని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. తర్వాత ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి, కొండపై ఈవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.