హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం కేసీఆర్ భేటీ

హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.  ఈ రోజు సాయంత్రం  ఆయన నివాసానికి వెళ్లిన సీఎం..   ఉజ్జల్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అయితే ఏ అంశం పై  వీరిద్దరూ చర్చిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సుప్రీంకోర్టుతో పాటుగా అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు జోక్యం చేసుకోవాలని కేసీఆర్ కోరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలను కూడా వారికి పంపినట్లు సీఎం వెల్లడించారు. అటు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్రమాణం చేసిన సంగ‌తి తెలిసిందే.

నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని..ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.