ప్ర‌జావైద్యుడు ల‌క్ష్మ‌ణ‌మూర్తి మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్ర‌జావైద్యుడు ల‌క్ష్మ‌ణ‌మూర్తి మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ ప్రజావైద్యుడు రమ‌క‌ లక్ష్మణ మూర్తి(83) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మణ మూర్తి ప్రజా వైద్యం కోసం తన జీవితాన్ని అర్పించి పీపుల్స్ డాక్టర్ గా ప్రజల గుండెల్లో కొలువుదీరారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన సేవలను తరతరాలు గుర్తు చేసుకుంటాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రెండేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ల‌క్ష్మ‌ణ‌మూర్తి వరంగల్‌లోని తన నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. లక్ష్మణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అప్పటి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌లో 1938 జూన్‌ ఒకటిన ఆయన జన్మించారు. ఓయూలో వైద్యవిద్యను పూర్తి చేసి కరీనంగర్‌ ప్రభుత్వ దవాఖానలో వైద్యుడిగా చేరారు. 1977లో వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో రెండు దశాబ్దాలపాటు సేవలందించారు.