38 ఏళ్ళుగా కేసీఆర్ సెంటిమెంట్ .. కోనాయిపల్లిలో ప్రత్యేక పూజలు

38 ఏళ్ళుగా  కేసీఆర్  సెంటిమెంట్ .. కోనాయిపల్లిలో ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతతం పలికారు అర్చకులు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు కేసీఆర్.   నామినేషన్ పత్రాలను వెంకన్న పాదాల ముందు పెట్టి పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో  నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.  అర్చకులు  కేసీఆర్ కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.   కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 

1985లో నామినేషన్ వేసే ముందు  కోనాయి పల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కేసీఆర్.  అప్పటి నుంచి  ఇదే సెంటిమెంట్ ను  ఫాలో అవుతున్నారు. ప్రతీసారి నామినేషన్ వేసే  ముందు కోనాయిపల్లి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే నామినేషన్ వేస్తున్నారు.  నవంబర్ 9న గజ్వేల్,  కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు కేసీఆర్. 

Also Read :- వంశీకృష్ణను కలిసిన దివ్యాంగులు

ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ తో పాటు,  కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో ప్రత్యర్థులుగా కాంగ్రెెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి బరిలో ఉండగా.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు