
తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు మహా ద్వారం దగ్గర కేసిఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు టి.టి.డి అధికారులు, అర్చకులు. రెండేళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు సీఎం కేసిఆర్. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేషవస్ర్తాన్ని బహుకరించారు టిటిడి అధికారులు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లనున్నారు కేసీఆర్