కాళేశ్వరం పర్యటనలో సీఎం కేసీఆర్

కాళేశ్వరం పర్యటనలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్…. అధికారులు, మంత్రులతో కలిసి   మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.  ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఏరియల్ సర్వే ద్వారా ఉదయం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంపుహౌస్‌‌లను సందర్శిస్తారు. గోదావరిలో 140 కిలోమీటర్ల పొడవునా నీళ్లు నిలిచిన నేపథ్యంలో ఏరియల్‌ సర్వే ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తర్వా త ధర్మపురి లక్ష్మీనర్సింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. పర్యటనలో కేసీఆర్​ వెంట సీఎంవో అధికారులు,ఇంజనీర్లు వెళ్తున్నారు.