పల్లె ప్రగతి కోసం ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే నిద్రించాలి

పల్లె ప్రగతి కోసం ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే నిద్రించాలి

హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రూ.6500 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి దయాకర్ రావు. బుధవారం రంగారెడ్డి జిల్లా జడ్పి హాల్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన దయాకర్ రావు..  గ్రామాల రూపు రేఖలు మార్చడానికే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించామని..3 విడతల పల్లె ప్రగతులు విజయవంతమయ్యాయన్నారు. 4వ విడత పల్లె ప్రగతి జూలై 1 నుండి 10 రోజుల పాటు జరుగుతాయని... ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ ఆఫీసర్ పల్లె ప్రగతిని పర్యవేక్షిస్తారన్నారు. గ్రామాల్లో ఉన్న యువత, వృద్దులు, మహిళలతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని.. పాత ఇల్లులు, పాత బావులు మట్టితో నింపాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్తను ప్రతి ఇంటి నుండి తీసుకెళ్ళాలని..గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా బకాయిలు లేవన్నారు. ఇటీవలే రూ. 250 కోట్లు బకాయులు చెల్లించామని.. ప్రతి మండలంలో 10 ఎకరాలలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  పల్లె ప్రగతికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న గ్రామాల అభివృద్ధిని చూసి మనకు అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పది రోజుల పాటు గ్రామాల్లోనే నిద్ర చేసి పల్లెప్రగతి పనులను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు మంత్రి.