
మహారాష్ట్ర నాందేడ్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం సీఎం కేసీఆర్ కు సిక్కు మత గురువులు అశీర్వచనాలు అందించారు. సీఎం వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు ఎయిర్పోర్టు దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.
మరికాసేపట్లో నాందేడ్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మహారాష్ట్రలో మొదటిసభ కావడంతో గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన ముఖ్యనేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇక ఈ వేదిక నుంచే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.