అసెంబ్లీ బడ్జెట్ : ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల 67 కోట్లు

అసెంబ్లీ బడ్జెట్ : ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల 67 కోట్లు

హైదరాబాద్ : ఓటాన్ అకౌండ్ బడ్జెట్‌ ను  అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్‌ లో రూ. 12 వేల 67 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహయులుగా మార్చిందన్నారు. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షను కింద కొన్నాళ్లు రూ. 75 మరికొన్నాళ్ల్లు రూ. 200 మాత్రమే విదిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్లు చెప్పుకున్నాయన్నారు.

వృద్ధులకు రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు తెలిపిన కేసీఆర్..  దివ్యాంగుల పెన్షన్ రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచామన్నారు. వృద్ధాప్య పెన్షన్‌ కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెరిగిన పెన్షన్ అందిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.