
కాళేశ్వరం ప్రాజెక్టు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సీఎం కేసీఆర్ ఉదయం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి 7.30 గంటలకు మేడిగడ్డ చేరుకున్నారు. తర్వాత దాదాపు 2 గంటలపాటు జలహోమం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ తో పాటు ఆయన భార్య శోభ కూడా హోమంలో పాల్గొన్నారు. పూజారులు కేసీఆర్ దంపతులతో జలహోమం చేయించారు. మేడిగడ్డ ఏరియాలో.. వేద మంత్రాల సాక్షిగా పండుగలా జలహోమం నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు వేదపండితులు. శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జల సంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు.